సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని మోదిన్ పురం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 600 మంది కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ వైట్ హౌస్ లో ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి లు వారికి పార్టీ కడువ కప్పి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ యువత విద్య, ఉపాధికై పెద్ద పీట వేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు.