4 రోజులుగా ఖాతాదారుని ఖాతాలో నగదు వేయని సిబ్బంది..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లిలోని ముత్తూట్ మనీలో సిబ్బంది ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఇందుకు ఒక ఖాతాదారునికి నాలుగు రోజులుగా బంగారు నగలకు సంబంధించి నగదును ఖాతాలో జమ చేయకపోవడమే నిదర్శనంగా మారింది. నేన్నెల్ మండలం మైలారం గ్రామానికి చెందిన కౌటా రపు రాజేందర్ ఖాతాదారుడు తన బంగారు నగలను ముత్తూట్ మనీలో నాలుగు రోజుల కిందట తాకట్టు పెట్టినా అతని ఖాతాలో దానికి సంబంధించిన రూ 7.35 లక్షల నగదు ఇప్పటివరకు జమ కాలేదు. దీంతో ఖాతాదారుడు రాజేందర్ ఆందోళనకు గురయ్యాడు. గురువారం ముత్తూట్ మనీ సిబ్బందిని ఆరా తీస్తే వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారని రాజేందర్ తెలిపారు. నాలుగు రోజులుగా తాకట్టు పెట్టిన బంగారు నగలకు సంబంధించిన నగదు ఖాతాలో జమ చేయకపోవడం తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఖాతాదారుడు రాజేందర్ ఆవేదన చెందారు.