558 కోట్లు కొట్టేసిన మహిళా ఉద్యోగి
టోక్యో, డిసెంబర్ 17: ప్రపంచంలోనే టెక్నాలజీలో ఎంతో ముందుండే జపాన్ దేశంలో భారీ దొంగతనం జరిగింది. ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి సుమారు 6.6 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 558 కోట్లు)ను బ్యాంకు ఉద్యోగి దొంగిలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి 2024 అక్టో బర్ చివరి నెల వరకు ఈ దొంగతనం జరిగనట్లు గ్రూప్ సీఈవో జునిచి హంజావా తెలిపారు. సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే రూ. 169 కోట్ల దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. బాధితులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.