తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సెంట్రల్ తైవాన్‌లోని ఓ గోదాంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరి గింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. పీఎక్స్ మార్ట్ నిర్వహణలో ఉన్న గిడ్డంగిలో ఉదయం 11 గంటలకు మం టలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో పరిసరాల్లో పెద్ద ఎత్తు న పొగ అలుముకుంది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మంది కి పైగా సిబ్బంది ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వారిలో ఒకరు మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.