calender_icon.png 30 October, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

30-10-2024 12:15:07 AM

  1. ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో దంపతులు మృతి
  2. మరో యువతికి తీవ్రగాయాలు 

చార్మినార్, అక్టోబర్ 29: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నిల్వ చేసిన బాణసంచాకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దంపతులు మరణించగా, మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. యాకు త్‌పురా నియోజకవర్గ పరిధిలోని చంద్రనగర్ బస్తీలో మోహన్‌లాల్ (55), ఉష (50) దంపతులు నివాసం ఉంటున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించడానికి ఇంట్లో నిల్వ ఉంచారు. సోమవారం రాత్రి దంపతులు ఇద్దరు తమ మనవరాలు శృతి గుప్తతో కలిసి పండుగ కోసం పిండి వంటలు చేస్తుండగా ప్రమాదవశాత్తు బాణసంచాకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగా యి.

వారు మంటల దాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయ త్నం చేసినప్పటికీ మోహన్‌లాల్, ఉష అక్కడికక్కడే మృతిచెందారు. శృతి గుప్తకు తీవ్ర గాయాలు కావడంతో మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

సమాచారం అం దుకున్న రైయిన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వగా, వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే నష్టం జరిగిపోయింది. కేసును రైయిన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.