calender_icon.png 17 March, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్త్ మెసిడోనియాలో భారీ అగ్నిప్రమాదం

17-03-2025 12:19:38 AM

  1. 51 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు
  2. పల్స్ నైట్‌క్లబ్‌లో కాన్సర్ట్ జరుగుతుండగా ఘటన

న్యూఢిల్లీ, మార్చి 16: యూరప్‌లోని నార్త్ మెసిడోనియాలో గల నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 51 మం ది మరణించగా 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి పాంచేతో ష్కోవ్సీ స్పష్టం చేశారు.

కొకాని పట్టణంలో ని పల్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు 100 మందికిపైగా గాయడ్డట్టు మీడియాకు తెలిపా రు. నైట్‌క్లబ్‌లో జరిగిన కాన్సర్ట్‌లో మండే స్వ భావం ఉన్న వస్తువు లను ఉపయోగించడం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నట్టు చెప్పారు.

నిప్పు రవ్వలు సీలింగ్‌కు తాకి, వెంటనే మంటలు డిస్కోటెక్ అంతటా వ్యాపించడంతో ఆ ప్రాంతాన్నంతటినీ దట్టమైన పొగ కమ్మేసిన ట్టు వెల్లడించారు. పల్స్ నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన కాన్సర్ట్‌కు 1500 మంది హాజరైనట్టు సమాచారం.