calender_icon.png 5 February, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం

05-02-2025 05:50:49 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్(Chandanagar Police Station) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్(Lingampally Railway Station) ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గరలో గల పూరి గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.