calender_icon.png 1 November, 2024 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

03-07-2024 12:06:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి) : నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 800 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నా రు పోలీసులు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా బెల్లంపల్లికి నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తుండగా మేడ్చల్ ఎస్‌ఓటీ, శామీర్‌పేట్ పోలీసులు ఆరెంజ్ బౌల్ రిసార్ట్ వద్ద పట్టుకున్నారు. కూరగాయ ల సంచుల మధ్యలో రహస్యంగా 40 సంచుల్లో 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో వాహనం నడుపుతున్న నల్ల మల్లేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. గుండ రాజు అనే వ్యక్తి ఆదేశాల మేరకు విజయవా డ నుంచి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నానని తెలిపాడు. గుండ రాజు కోసం పోలీ సులు గాలింపు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మిన, సరఫరా చేసినట్లు తెలిసిన పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శోభన్‌కుమార్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు, శామీర్‌పేట్ సీఐ శ్రీనాథ్ పాల్గొన్నారు. 

ఇద్దరు అరెస్ట్..

గజ్వేల్ : ఏంజెల్ అనే వ్యక్తి మంగళవారం వర్గల్ మండలంలోని బొర్రగూడెం గ్రామ శివారు చందాపూర్‌లో నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎంజెల్‌ను విచారించగా కరీమొద్దీన్, కాస స్వామి అనే ఇద్దరు రైతులకు విత్తనాలు అమ్మినట్లు తెలిపాడు. వెంటనే రైతుల వద్ద ఉన్న 12కిలోల 150గ్రాముల విత్తనాలు స్వాధీనం చేసుకుని ఏంజెల్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని బేగంపేట ఎస్‌ఐ భువనేశ్వర్‌రావు, వర్గల్ మండల వ్యవసాయాధికారి శేషనాయని పేర్కొన్నారు.