12-03-2025 09:08:12 PM
కార్మికునికి తీవ్ర గాయాలు
గాంధీ దవాఖానకు తరలింపు
ముషీరాబాద్,(విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ గుల్షన్ నగర్ లోని కట్నికాంట సమీపంలో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో బుధవారం భారీ పేలుడు సంభవించడంతో కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే... కట్నీకాంట సమీపంలో కరీం అనే వ్యక్తి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద బీహార్ కు చెందిన ఇసాక్ అహ్మద్ (28) ప్లాస్టిక్ వస్తువులను పగులగొట్టి భద్రపరిచే పని చేస్తుంటాడు. ఇందులో భాగంగా గుర్తు తెలియని కెమికల్ డబ్బాను పగలగొడుతుండగా భారీ శబ్దంతో పేలడంతో పని చేస్తున్న కార్మికుడు ఇసాక్ అహ్మద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ముఖము, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఇసాక్ అహ్మద్ ను ఆటోలో గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. ముషీరాబాద్ సిఐ రాంబాబు ఘటన స్థలానికి చేరుకొని వివరాల సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ శబ్దం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.