కాకినాడ : అమలాపురం రావులచెరువు ప్రాంతంలోని బాణసంచా కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా ఏడుగురికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను కిమ్స్ కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అటు ఎమ్మెల్యే ఆనందరావు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పలుకరించి పరామర్శించారు.