calender_icon.png 27 January, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

25-01-2025 01:36:36 AM

ఎనిమిది మంది మృతి.. ఏడుగురికి గాయాలు

ముంబై, జనవరి 24: మహారాష్ట్రలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.  భాండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యా క్టరీలో శుక్రవారం ఉదయం పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ పైకప్పు తునాతునకలై శకలాలు కింద పడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ఎనిమిది మంది తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.