calender_icon.png 6 January, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టలో భారీ పేలుడు: ఒకరు మృతి

04-01-2025 11:52:34 AM

హైదరాబాద్: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌క్లూజివ్ ఫ్యాక్టరీ(Premier Explosives Factory)లో శనివారం జరిగిన పేలుడు ఘటనలో జనగామ బచ్చన్నపేటకు చెందిన కనకయ్య అనే కార్మికుడు మృతి చెందగా, మరో ఏడుగురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్(Secunderabad)లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు క్షతగాత్రులను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. భయంతో సంఘటన స్థలం నుండి పారిపోయిన కార్మికులలో భయాందోళనలకు దారితీసింది. పేలుడు సంభవించిన వెంటనే కంపెనీ యాజమాన్యం అత్యవసర సైరన్‌ను మోగించింది. సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.