calender_icon.png 15 January, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి

17-07-2024 10:02:14 PM

గడ్చిరోలి: మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ 12 మంతి మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్ సరిహద్దు వందోలీ అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నక్సల్స్, పోలీసు సిబ్బంది మధ్య ఆరు గంటలకు పైగా ఎన్‌కౌంటర్ కొనసాగింది.

ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా.. 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి చెందగా.. మృతుల్లో ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.