calender_icon.png 21 January, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు.. 12 నక్సల్ మృతి

21-01-2025 10:33:26 AM

ఒడిశా,(విజయక్రాంతి: ఛత్తీస్ గడ్ లోని ఒడిశా సరిహద్దుల్లో సంయుక్త భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య రెండ్రోజులుగా భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో నుంచి ఇప్పటివరకు 12 మృతదేహాలు లభించయాన్ని, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఒక జవాన్ మెడను పదునైన వస్తువు తట్టుకోవడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మరణించిన ఇద్దరు మహిళలు సోనాబేడ-ధరంబంధ కమిటీకి చెందినవారని, జవాన్ కోబ్రాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 28కి చేరుకుంది. ఈ సమయంలో తొమ్మిది మంది జవాన్లు, ఒక పౌర డ్రైవర్ కూడా మరణించారు. 

గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో నిన్నటి నుంచి భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ లో గరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్వోజీ దళాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, 207 కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) మరియు ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా మట్లడుతూ.. మావోయిస్టులు ఆటోమేటిక్ ఆయుధం, బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో తామపై దాడి చేశారన్నారు. నాలుగు ఐఈడీలను అమర్చారు, వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ సంవత్సరం గరియాబంద్‌ జిల్లాలో ఇది రెండవ ఎన్‌కౌంటర్. ఈనెల 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించగా, బీజీఎల్ లు, ఒక రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.