8 మంది మావోయిస్టులు మృతి
చర్ల, ఫిబ్రవరి 1: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో శనివారం ఉద యం 8.30 ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పు లు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
గంగలూరు అటవీ ప్రాంతంలో శనివారం ఉద యం నుంచి భద్రతా బలగాలు, నక్స ల్స్ మధ్య కాల్పులు కొనసాగాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (టీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఆపరేష న్‌లో భాగస్వామ్యులైనట్లు ఐజీ పీ సుందర్‌రాజన్ తెలిపారు.
పశ్చిమ బస్తర్ డివిజర్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఐజీ చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మరణించారని మావోయిస్ట్ నేతలు పేర్కొన్నారు.