* 12 మంది మావోయిస్టులు మృతి
* భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
చర్ల, జనవరి 16: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బీజాపూర్, డీఆర్జీ సుక్మా, డీఆర్జీ దంతేవాడ, కోబ్రా 204, 205, 206, 208, 210, కారిపు 229 బెటాలియన్లు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు.
ఉదయం 9 గంటల నుంచి భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి SLR, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్ సైనికులు కూడా పాల్గొన్నారు.
సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఆదివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.