బీజాపూర్,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా(Bijapur District)లో ఆదివారం భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్(Indravati National Park)లో భద్రతా సిబ్బందికి నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో 31 మంది నక్సలైట్లు, ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పీ.సుందర్ రాజు తెలిపారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలోని అడవిలో ఉదయం భద్రతా సిబ్బంది బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు కాల్పులు జరిగాయని ఒక సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కాల్పుల్లో 31 మంది నక్సలైట్లు(Naxalites) మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు గాలిస్తున్నాయి. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకొగా, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.