calender_icon.png 11 February, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం

10-02-2025 12:24:07 AM

రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదు

హొండురస్, ఫిబ్రవరి 9: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం హొండురస్‌కు ఉత్తర దిశలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.6గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. కెమెన్ దీవుల తీరానికి 209 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది.

ఈనేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, హొండూరస్, కోస్టారికా, నికరాగ్వా, క్యూబా దేశాలపై కూడా భూకంప ప్రభావం కనిపించింది. సునామీ అలలు క్యూబా తీరాన్ని తాకే అవకాశం ఉందని, 1నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.