calender_icon.png 2 November, 2024 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడాలో భారీగా డ్రగ్స్ పట్టివేత

02-11-2024 12:04:00 AM

భారత సంతతి వ్యక్తి అరెస్ట్

న్యూఢిల్లీ, నవంబర్ 1: కెనడాలో వాంకోవర్ పరిధిలో అక్రమంగా ల్యాబ్‌ను నడుపుతున్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహించగా భారీగా డ్రగ్స్‌తో పాటు పలు రకాల రసాయనాలు, ఆయుధాలు లభించాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న భారత సంతతికి చెందిన గగన్‌ప్రీత్ సింగ్ రంధవాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో కిలోల కొద్ది ఫెంటానిల్, మెథాంఫెటమైన్, కొకైన్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలను కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు, పేలుడు పదార్థాలు, పలు ప్రమాదకర ఆయుధాలు, 5 లక్షల డాలర్ల నగదును సైతం గుర్తించారు. ఈ కేసులు మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల పాటు దర్యాప్తు అనంతరం డ్రగ్స్ గుట్టురట్టు చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు.