calender_icon.png 12 March, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ సైబర్ కుట్ర భగ్నం

12-03-2025 01:45:28 AM

పాత సెల్ ఫోన్ కొనుగోలు ముఠా అరెస్ట్

ఆదిలాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): పాత సెల్ ఫోన్ లే కదా.. అని స్టీల్  సామాం డ్లు, ప్లాస్టిక్ డబ్బాలకు అమ్మేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు... మీరు అమ్మిన ఫోన్‌లతో సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్టీల్ డబ్బాల ఆశ చూపి పాత సెల్ ఫోన్ లను కొనుగోలు చేసి, వాటిని బీహార్‌లో  తబరాక్ అనే వ్యక్తి కి అమ్మి వేస్తూ సైబర్ నేరాలకు పాల్పడే ము ఠాను ఆదిలాబాద్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు. సైబర్ నేరాలకు పాల్పడే  ఆరుగురు ముఠా సభ్యుల్లో తబరాక్ పరారీలో ఉండగా,  మొ హమ్మద్ మెరాజుల్, మహబూబ్ ఆలం,  మొహమ్మద్ జమాల్, ఉజీర్ అబ్దుల్లా ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుండి 2,125 పాత ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వా హనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఫోన్లు కొనుగోలు చేసిన వారు బీహార్ లో సైబర్ నెరగాళ్లకు వాటిని అమ్ముతున్నారన్నారు. కొనుగోలు చేసిన పాత ఫోన్‌లు, సిమ్ కార్డు, ఈఎంఐ నెంబర్లను ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్ళు సైబర్ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతు న్నారని ఎస్పీ తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, హసీబుల్లా, సీఐ కమలాకర్ రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.