calender_icon.png 13 April, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ సభకు భారీగా తరలి వెళ్ళాలి

12-04-2025 10:31:39 PM

- బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్  రెడ్డి

- బొల్లారం మున్సిపాలిటీలో  ఛలో వరంగల్  పోస్టర్ ఆవిష్కరణ

పటాన్ చెరు: ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభకు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలకు తెలిపారు. వరంగల్ సభ సందర్భంగా శనివారం ఐడిఏ బొల్లారంలో మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి నివాసంలో వరంగల్ సభ పోస్టర్ పార్టీ నియోజకవర్గ, మండల నాయకులతో కలిసి ఆదర్శ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలన్నారు. ఆ దిశగా పట్టణ, మున్సిపాలిటీ, మండల, గ్రామ నాయకులు ఏర్పాట్లలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మాజీ జడ్పీటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ  రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచులు ప్రకాష్ చారి, సురేందర్ గౌడ్, కొరివి ఆంజనేయులు, శివ రాజు, నాయకులు మాణిక్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, మంద రమేష్  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.