calender_icon.png 13 January, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైడన్ తొలగింపు వెనుక భారీ కుట్ర

29-07-2024 01:50:38 AM

  1. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ
  2. 25వ అధికరణ చూపి బలవంతం చేశారు
  3. ఎన్ని కుట్రలు పన్నినా విజయం తననే వరిస్తుందని ట్రంప్ ధీమా

వాషింగ్టన్, జూలై 28: అమెరికా అధ్యక్షుడు బైడన్‌పై డెమోక్రాటిక్ పార్టీ నేతలు భారీ కుట్రపన్ని అతన్ని అధ్యక్ష రేసునుంచి తప్పించారని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. శనివారం మిన్నెసొటాలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. దాదాపు 14 మిలియన్ల ఓట్లు కలిగిన ఓ దేశాధ్యక్షుడిని రేసులో నిలబడకముందే సొంత పార్టీ నేతలు అవమానపరిచి రేసు నుంచి తప్పించారు.

వాస్తవానికి బైడన్‌కు అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడం ఇష్టం లేనప్పటికీ అధికరణ 25ను బూచిగా చూపారని.. ఈ అధికరణ ద్వారా అధ్యక్ష అభ్యర్థిని మార్చే వెసులుబాటు ఉందని.. ఒకవేళ మీరు తప్పుకోకపోతే మేమే తప్పిస్తామని డెమోక్రాట్లు బైడన్‌ను హింసించారని ట్రంప్ వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అమెరికా కాంగ్రెస్ ఈ సవరణను తీసుకొచ్చింది. కాగా బైడన్ రెండోసారి అధ్యక్ష రేసునుంచి తప్పుకుంటున్నట్లు జూలై 20న ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా బైడన్ ప్రతిపాదించారు.