calender_icon.png 3 March, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోగస్ సదరం సర్టిఫికెట్లు ఏరివేయాలి

03-03-2025 03:56:16 PM

చట్టం సాధన కోసం లక్ష సంతకాల సేకరణ మహోద్యమం చేపడుతాం

ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బోగస్ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య(NDRF State General Secretary M. Adivaya) అన్నారు. సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(National Platform for Rights of Disbaled) మహబూబ్ నగర్ కమిటీ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు టి మధుబాబు అధ్యక్షతన సీఐటీయు జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ... 2012 నుండి  పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ 300 మాత్రమే చేల్లిస్తుందని, ఈ డబ్బులతో వికలాంగులు ఎట్లా బ్రతుకుతురని ప్రశ్నించారు. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెంచిన పీఎం మోడీకి వికలాంగుల పెన్షన్స్ పెంచాలానే ఆలోచన ఎందుకు రావడం లేదన్నారు.

2015 డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధులు బడ్జెట్లొ ఎందుకు కేతాయించలేదన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు మొండి చెయ్యి చూపినరాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమనికి 0.025 శాతం కేటాయించడం ఎంత వరకు సమంజసం అన్నారు. మోడీ పాలనలో కేటాయించిన నిధుల్లో 2020-21లొ 64శాతం, 2021-22లో 86శాతం, 2022-23లో 79 శాతం, 2023-24 లో 93 శాతం  విడుదల చేయకుండా వికలాంగుల గురించి మాట్లాడే హక్కు మోడీ ప్రభుత్వంకు ఎక్కడిదన్నారు. వికలాంగుల కోసం అమలావుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిందని పేర్కొన్నారు. స్కీం ఫర్ ది ఇంప్లిమెంటేషను ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్స్ యాక్ట్ పథకానికి కేటాయింపులు మరింత తగ్గించడం ఆందోళన కల్గిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

2022-23లొ 250.39 కోట్లు, 2024-25లొ 135.33 కోట్లు కేటాయిస్తే 2025-26 బడ్జెట్ లో 115.10 కోట్లకు తగ్గించరని పేర్కొన్నారు. గత బడ్జెట్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు 758.01 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో 741.80 కోట్లకుతగ్గించారు.మానసిక వికలాంగుల కోసం అమలవుతున్న తెలిమెంటల్ హెల్త్ పోగ్రామ్ కోసం గత బడ్జెట్ లో 90కోట్లు కేటాయిస్తే 2025-26 బడ్జెట్ లొ 79.60 కోట్లకు తగ్గించారన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను విస్మరించరని అన్నారు. ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం (IGNDPS)కు కేటాయింపులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరకరించిందని ప్రశ్నించరు వికలాంగుల జనాభాలో కేవలం 3.8 శాతం మంది వికలాంగులకే వర్తించే ఇందిరా గాంధీ నేషనల్ డిసబుల్డ్ పెన్షన్ స్కీం పథకంను వికలాంగులందరికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగులకు 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

రాజస్థాన్, చత్తీస్ ఘడ్  రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తురన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి,ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం  చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి,మండల ప్రజా పరిషత్ లలో 1080 మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి.

రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్ ) ప్రతినిత్యం కల్పిస్తూ  అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేస్తామని ప్రకటించడం జరిగిందని అన్నారు.2025 మార్చి 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కురుమూర్తి, ఎన్డీఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టీ.మధు బాబు,  కార్యదర్శి రామకృష్ణ, నాయకులు పారిజాత, మొగులయ్య తదితరులు ఉన్నారు.