calender_icon.png 12 January, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ షోకు భారీ ఏర్పాట్లు

08-12-2024 01:47:42 AM

  1. ఈ ప్రదర్శన రాష్ట్రానికే గర్వకారణం
  2. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్షమంది మహిళలు హాజరు
  3. సమీక్షలో సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి):  ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం  నిర్వహించే ఎయిర్ షో కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఇబ్బందులు కలు గకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

ఆదివారం వైమానిక ప్రదర్శన, సోమవారం నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆమె శనివా రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ వైమానిక ద ళం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో తొమ్మిది సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని తెలిపారు.

ఈ విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీంలకు మా త్రమే ఉందని, అందులో ఒక టీమ్ హైదరాబాద్‌లో చేయడం మన రాష్ట్రానికే గర్వకార ణమన్నారు. ముఖ్యమంత్రితో పాటు మం త్రులు, వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఎయిర్ షో వీక్షణకు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ షోతోపాటు సాయం త్రం నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్‌కు నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్‌లో ప్రజల సౌకర్యార్థం ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లీగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని.. భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

లక్షమంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ 

ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షమంది మహిళలు పాల్గొంటారని, తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దాదాపు 150 మంది ప్రముఖులు ఆసీనులయ్యేలా ప్రధాన వేదికతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికను ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులకు ఆహ్వానాలు సకాలంలో పంపాలని సూచించారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్‌లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ విక్రంజీత్ సింగ్‌మాన్ తెలిపారు.

మహిళలను ఎక్కువ దూరం నడవకుండా వేదిక సమీపంలోకి వాహనాలను అనుమతించి, అనంతరం పార్కింగ్ వద్దకు పంపాలని సీఎస్ సూచించారు. సమావేశంలో జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.