calender_icon.png 10 January, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతిమాత జాతరకు భారీ ఏర్పాట్లు

10-01-2025 12:00:00 AM

  • జాతరకు సర్వం సిద్ధం 
  • ఈనెల 12, 13న జాతర 

జహీరాబాద్, జనవరి 9 : మోతిమాత జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిం చేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొగుడంపల్లి మండలంలోని ఉప్పరపల్లి తాండ లో ఉన్న మోతీ మాత జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు గిరిజన నాయకులు, ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఈ జాతరకు తెలం గాణ, కర్ణాటక, మహారాష్ర్ట కు చెందిన గిరిజనులు కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు.

మోతిమాత జాతరకు గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మ వారికి తీర్థప్రసాదాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. 12వ తేదీన గిరిజనులు తాం డల నుంచి భారీ సంఖ్యలో నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. బాజా భజంత్రీలతో జెండాను తీసుకొని తాండల నుంచి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు.  13న గిరిజనులు అమ్మవారికి మొక్కలు తీర్చుకొకుంటారు.  

జాతర పోస్టర్ ఆవిష్కరణ

సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి మండలం లో ఉన్న ఉప్పర్ పల్లి తండా లో  మోతి మాత ఆలయం ఆవరణలో జాతర పోస్టర్ నిర్వాహకులు ఆవిష్కరించారు. మోతి మాత జాతర  12 , 13 వ తేది లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  తెలంగాణ రాష్ర్టంతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి  భక్తులు హాజరవుతారు.