calender_icon.png 4 February, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్దన మంచిదే!

30-01-2025 12:00:00 AM

నూనెతో పాదాలకు మర్దన చేయడాన్ని ఆయుర్వేదంలో పాద అభ్యంగనం అంటారు. పాదాలకు మర్దన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. 

పాద మర్దన కోసం నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనెలను వాడుకోవచ్చు. శరీర శక్తిని సంతులనం చేసే ప్రదేశాలు ప్రేరేపితమవుతాయి. ఫలితంగా శరీరం సేద తీరుతుం ది. ఒత్తిడి, కంటి నిండా నిద్ర పడుతుంది. నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది. రక్త ప్రసరణ మెరుగై వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.

పగుళ్లు వదిలిపోయి, పాదాలు కోమలం గా మారతాయి. రోజంతా శరీర బరువును మోస్తూ అలసిన పాదాల్లోని కండరాలు సేద తీరతాయి. బ్యా క్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. నువ్వుల, కొబ్బరి నూనెతో మర్దన చేయడం వల్ల కీళ్లనొప్పి తగ్గుతుంది.