12-02-2025 07:53:21 PM
మందమర్రి (విజయక్రాంతి): మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి మిట్టపల్లి సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.