calender_icon.png 21 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాల్మీకి ఆవాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

21-04-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. గ్రామీణ, నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన బాలురకు క్రమశిక్షణతో కూడిన విద్య, వసతిని ఉచితంగా అందిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ప్రారంభంలో సామూహిక సత్యనారా యణ స్వామి వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

సమాజంలో సామా జిక సమరసత ను పెంపొందించడంలో భాగంగా ఆవాస విద్యార్థుల బంధువులు, సమాజంలోని ఇతర ప్రముఖులంతా కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించుకుంటారు. ఈ వ్రతాలలో 2 వందల జంటలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచారక్ లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి గొప్పదైన సనాత ధర్మాన్ని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా వాల్మీకి ఆవాస వెబ్ సైట్ ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి అన్న ప్రసాదము గా సామూహిక భోజనం ఏర్పాటు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, డాక్టర్ భీమనాతిని శంకర్, సభ్యులు లక్ష్మారెడ్డి, సంపూర్ణ చారి, మధుకర్, కైలాసం, సురేష్, శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.