29-03-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జి ల్లా వైద్య ఆరో గ్య శాఖ మాస్ మీడియా అధికారి రవి శంకర్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. బాలిక అబార్షన్ అయ్యేందుకు మన్నూరులోని ఓ మెడికల్ వ్యాపారి మందులు ఇచ్చా డు. దీంతో సదరు మెడికల్ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. మెడికల్ షాప్ ఓపెన్ చే యాలంటే సదరు వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం ఇవ్వాలని మా స్ మీడియా అధికారి రవిశంకర్ డిమాండ్ చేశాడు. షాపు యజమా ని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రూ.30 వేలు తీసుకుంటుండగా రవిశంకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.