01-04-2025 11:00:58 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ విద్యాజ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ పీఠాదిపతులు ఆధ్వర్యంలో అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షా సేవా సమితి ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయస్వామి దీక్ష స్వాముల 16వ సామూహిక మహా మండల పూజ విశ్వశాంతి కొరకు సుదర్శన సహిత అష్టోత్తర (108) శత కుండాత్మక 158వ హనుమాన్ మహాయజ్ఞం కార్యక్రమానికి సతీమణి పోచారం పుష్పతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న పోచారం శంభురెడ్డి - ప్రేమల, పరిగే వెంకట్ రామ్ రెడ్డి - అరుణ, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోనీ దంపతులు ఈ హనుమాన్ మండల పూజలో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు హనుమాన్ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.