calender_icon.png 23 January, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మాస్’ మళ్లీ వస్తున్నాడు!

13-08-2024 12:00:00 AM

ఆగస్టు 29.. సీనియర్ నటుడు నాగార్జున పుట్టిన రోజు. ఆ డేట్‌కు ఒక రోజు ముందే నాగార్జున అభిమానులకు పండుగ రోజు. ఔను, ఆగష్టు 28వ తేది నాగార్జున ఐకానిక్ మూవీ ‘మాస్’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రీరిలీజ్ విషయాన్ని మేకర్స్ సోమవారం ప్రకటించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ ‘చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్‌తో సహా ప్రముఖ నటీనటులు నటించారు. దేవిశ్రీ సంగీత దర్శకత్వం వహించగా, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.