calender_icon.png 27 February, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్క్ యాక్షన్

27-02-2025 12:00:00 AM

నటిగా, గాయనిగా సత్తా చాటింది చెన్నై బ్యూటీ ఆండ్రియా జెరెమియా. ఇప్పుడు తమిళ చిత్రం ‘మాస్క్’ తో నిర్మాతగా మారనుంది. ఆండ్రియా, ఎస్పీ చోకలింగం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్‌రూట్ ఫిల్మ్ కంపెనీ సమర్పిస్తోంది. ఈ సినిమాకు విక్రణన్ అశోక్ దర్శకత్వం వహిస్తుండగా, కవిన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. కవిన్ తన కెరీర్‌లో తొలిసారిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నాడనేది చిత్ర యూనిట్‌కు సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరి స్తున్న ఆండ్రియా ఇందులో ప్రతినాయకిగా నటిస్తుందని సమాచారం. అయితే ఆండ్రియా విలన్‌గా నటించడం ఇది తొలిసారి కాదు. దర్శకుడు వెట్రిమారన్ ‘వడచెన్నై’లో ఆమె ప్రతినాయక ఛాయలున్న పాత్రనే పోషించింది.  బుధవారం మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. మొత్తం మూడు పోస్టర్లు విడుదల చేయగా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పోసర్లలో రాసి ఉన్న ‘వాతియారగ వెట్రిమారన్’ అనే వ్యాఖ్య.. వెట్రిమారన్ ఇందులో ‘వాతియార్’ అనే పాత్రను పోషిస్తు న్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్; సంగీతం: జీవీ ప్రకాశ్.