01-02-2025 12:18:48 AM
సూర్యాపేట, జనవరి 31 : అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా మర్యాద సైదులు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తూము వెంకన్న యాదవ్ ని నియమించి ఈమేరకు నియామక పత్రాన్ని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ శుక్రవారం అందిం చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో యాదవ్ ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
యాదవులకు ఎక్కడ అన్యాయం జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ముందుండి పోరాడుతుంద న్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కుల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, భయ్య నారాయణ యాదవ్. పోలెబోయిన నర్సయ్య యాదవ్, సుంకర బోయిన శ్రీనివాస్ యాదవ్, వజ్జే వీరయ్య యాదవ్, గోడ్డేటి సైదులు యాదవ్, బుడిగే మల్లేష్ యాదవ్, కోడి లింగయ్య యాదవ్, బోయిని సైదులు యాదవ్ పాల్గొన్నారు.