calender_icon.png 15 March, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ మానవాళి విముక్తికి మార్క్సిజమే మార్గం

15-03-2025 12:22:37 AM

ఖమ్మం, మార్చి 14 (విజయక్రాంతి):  కారల్ మార్క్స్ రచనలలో “కమ్యూనిస్టు ప్రణాళిక, దాస్ క్యాపిటల్, పెట్టుబడి” గ్రంథాలు ప్రపంచ పెట్టుబడిదారులను ఉలిక్కిపడేలా చేసాయని, పెట్టుబడిదారీ విధానానికి మార్క్సిజమే సరైన మార్గమని కారల్ మార్క్స్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.

కారల్ మార్క్స్ 142వ వర్థంతి సందర్భంగా శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో జిల్లా కమిటి ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన సభను నిర్వహించటం జరిగింది. ముందుగా కారల్ మారక్స్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారల్ మార్క్స్ మరణించి నేటికి 142 సంవత్సరాలు అవుతున్నా, ప్రపంచ వ్యాపితంగా మార్క్సిజమే అజేయంగా కొనసాగుతుందని, పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని, మార్క్స్ రచనల ద్వారా వాటిని వివిధ దేశాలు అన్వయించుకొని ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాలను జయప్రదం చేసుకొని నేడు అగ్రగామి దేశాలుగా సోషలిస్టు దేశాలు కొనసాగుతున్నాయి. సోషలిజమే ప్రత్యామ్నాయమని మార్క్స్ చెప్పింది రుజువు అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, నవీన్రెడ్డి, మెరుగు రమణ జిల్లా నాయకులు ఆర్.ప్రకాష్, బండారు యాకయ్య, నర్రా రమేష్, ఎకడమిక్ జిల్లా బాధ్యులు బోడపట్ల రవీందర్, 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్, సదానందం, నామా లక్ష్మినారాయణ, విప్లవ్ కుమార్, పుల్లారావు, పగడాల నాగేశ్వరరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.