calender_icon.png 16 January, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్క్సిజం ఓ శాస్త్రీయ సిద్ధాంతం

31-08-2024 04:59:45 PM

కాలంతో పాటు మార్క్సిజం పయనం 

కమ్యూనిస్టులు దృఢంగా ఉండాలి.. 

సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా రెండో విడత రాజకీయ శిక్షణా తరగతుల్లో పార్టీ జిల్లా *కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, (విజయక్రాంతి): మార్క్సిజం ఓ శాస్త్రీయ సిద్ధాంతమని సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. కమ్యూనిస్టులు దృఢంగా ఉండాలని సూచించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన  పార్టీ రెండో విడత రాజకీయ శిక్షణ తరగతుల్లో నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. మానవ సమాజం ఉన్నంత కాలం మార్క్సిజం ఉంటుందని అన్నారు. మార్క్సిస్టులు ప్రజా సమస్యలను విశ్లేషించడంతో పాటు దాని కారణాలను పరిష్కార మార్గాన్ని చూపాలని పేర్కొన్నారు. కాలంతో పాటు ప్రయాణించేది మార్క్సిస్టులు అని స్పష్టం చేశారు.

మార్క్సిజం శాస్త్రి సిద్ధాంతమని, కమ్యూనిస్టులు దృఢంగా ఉండాలన్నారు. కాలానుగుణంగా చోటు *చేసుకునే మార్పులను మార్క్సిస్టులు అర్థం చేసుకొని, పాలక ప్రభుత్వాల రాజకీయ వ్యూహాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి *మార్క్సిజం ఓ దిక్సూచిలా పనిచేయాలన్నారు. మతోన్మాదానికి విరుగుడు మార్క్సిజం మాత్రమేనని పేర్కొన్నారు. తొలి రోజు శిక్షణా తరగతుల్లో భాగంగా సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేశ్ ‘ గతి తార్కిక భౌతిక వాదం'పై బోధించారు. మధ్యాహ్నం పార్టీ సీనియర్ నాయకులు పి. సోమయ్య ‘ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర' ఆవశ్యకతను వివరించారు. 

శౌర్యయాత్ర కరపత్రం ఆవిష్కరణ

శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ రూపొందించిన శౌర్య యాత్ర కరపత్రాన్ని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గం, జిల్లా కమిటీ ఆవిష్కరించింది . సెప్టెంబరు ఒకటి నుంచి 17 వరకు వీరులు నడిచిన దారుల్లో... నిర్వహించే శౌర్య యాత్రను విజయవంతం చేయాల్సిందిగా నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వీర తెలంగాణ సాయుధ పోరాట బాట.. వీధి వీధిలో మెరిసే నెత్తుటి పూదోటగా కళారూపాలతో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు అదేవిధంగా ఈ యాత్రకు సంబంధించిన బ్రోచెర్ను ఈరోజు విడుదల చేసినారు.  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేశ్, మాదినేని రమేష్, ఎర్ర శ్రీనివాసరావు ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్ష్మీనారాయణ,సదానందం, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు .