22-02-2025 12:35:28 AM
పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే..!!
ఇల్లెందు, ఫిబ్రవరి 21 : ఇల్లెందు పట్టణంలోని ఏలూరిభవన్ లో ఇల్లందు,టేకులపల్లి సీపీఎం పార్టీ మండల కమిటీల ఆద్వర్యం లో ఇల్లందు పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన రెడ్ బుక్ డే సందర్భంగా కమ్యూనిస్టు ప్రణాళిక ను సామూహిక పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు పాల్గొని మాట్లాడుతూ మార్క్సిజం అజేయమని, పెట్టుబడి దారీ వ్యవస్థ కు ప్రత్యామ్నాయం కమ్యూ నిజమే అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యంతో, కరువు, నిరుద్యోగం, దారిద్య్రం అధికమైన చోట పెట్టుబడి దారీ వ్యవస్థ అంతమింది కమ్యూనిస్టు ఎర్రజెండా రెప రెప లాడుతుందని అన్నారు. ప్రపంచ దేశాలకు భిన్నంగా మన దేశంలో పెట్టుబడి దారీ, ఫాసిస్టు తరహా లో కార్పోరేట్ అనుకూల వైఖరి గల పచ్చి మతవాద బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని దానికి ప్రత్యామ్నాయంగా వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేసి వామపక్ష లౌకిక ప్రజాతంత్ర సంఘటనను ఏర్పాటు చేయ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఏప్రిల్ నెల మొదటి వారం మదురై లో సీపీఎం పార్టీ అఖిలభారత 24వ మహాసభలలో జాతీయ అంతర్జాతీయ పరిస్థితులపై అధ్యయనం చేసి కార్మిక కర్షక ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను జాతీయ పార్టీ రూపొందించనున్నదని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ కోరారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, పార్టీ మండల కమిటీ సభ్యులు, మాదారపు వెంకటేశ్వర్లు, కల్లేపల్లి మరియా, మహమూద్, తాళ్లూరి పద్మ,తాండ్ర కాంత, కామ నాగరాజు, సత్యనారాయణ కోరి,రమేష్, మన్యం మమత, భద్రు, బాబు, వీరయ్య, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.