calender_icon.png 4 March, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతీ సుజుకీ లాభంలో 16 శాతం వృద్ధి

30-01-2025 12:31:57 AM

టాటా మోటార్స్ 22% క్షీణత

ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయా రీ కంపెనీ మారుతీ సుజుకీ బుధవారం  త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.3,727 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,207 కోట్ల తో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది.

కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ. 33,513 కోట్ల నుంచి రూ.38,764 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో మారుతీ సుజుకీ నికర లాభం రూ.3,525 కోట్లుగా నమోదైంది. దేశీయ విక్రయాలు 4,66,993 యూనిట్లు గా నమోదయ్యాయి.

ఎగుమతులు 99,220 యూనిట్లకు చేరాయి. అలా ప్రముఖ వాహ న తయారీ సంస్థ టాటా మోటార్స్  మూడో త్రైమాసిక ఫలితాల్లో క్షీణత నమోదు చేసిం ది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.5,578 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 7,145 కోట్లతో పోలిస్తే 22 శాతం క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ.1,10,577 కోట్ల నుంచి రూ.1,13,575 కోట్లకు చేరింది.