నిజామాబాద్ వరుణ్ మోటర్స్‌లో డిజైర్ కారును ప్రారంభిస్తున్న నీతూకిరణ్
- ఆల్ ఇండియాలో నంబర్ వన్ డీలర్ వరుణ్ మోటార్స్
- నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్
కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 14 (విజయక్రాంతి): వాహన తయారీలో దిగ్గజంగా పేరున్న మారుతీ సుజుకి కంపెనీకి పేరుందని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వరుణ్‌మోటార్స్‌లో మారుతీ సుజుకి కంపెనీ న్యూ డాజిలింగ్ డిజైర్ కారును ఆవిష్కరించి మాట్లాడారు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్న వరుణ్ మోటార్స్ ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింద న్నారు.
మొదటి మూడు కార్లను, కస్టమర్లు నీరడి గంగారాజు, వివేక్ టెన్నిసన్, ఎర్రోల్ల మారుతిలకు నీతూకిరణ్ అందజేశారు. కంపెనీ జనరల్ మేనేజర్ ఎన్‌వి రమణగుప్తా మాట్లాడుతూ.. డిజైర్ కారు నడపడం చాలా సరదాగా ఉంటుందని అన్నారు. కారు ప్రారంభ ధర రూ.6.78 లక్షల నుంచి రూ.9.68 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఎలక్ట్రిక్ సన్ రూప్ కలిగి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 27 లక్షలకు పైగా కస్టమర్ల ప్రేమను డిజైర్ అందుకుందున్నారు. మైలేజీలో కూడా రారాజుగా డిజైర్ వాహనం నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏజీఎం యెండల సుమన్ పాల్గొన్నారు