calender_icon.png 24 January, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు

24-01-2025 01:04:28 AM

వచ్చే నెలనుంచి అమలు

ముంబై:  దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ  వాహన ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కారు మోడల్ ఆధారంగా అత్య ధికంగా రూ.32,500 వరకు పెంపు ఉం టుందని తెలిపింది.

ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో వాహన ధరల పెంపు నిర్ణయం తప్పలేదని, దీంతో కొంతభాగం వినియోగదారులకు బదిలీ చేయడం మినహా వేరే మార్గం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. మోడల్ని బట్టి ధరల పెంపు ఉంటుందని పే ర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకా రం.. సెలెరియో ) కారుపై రూ.32,500, ఇన్విక్టో ప్రీమియం మోడళ్‌పై రూ.30వేలు పెంపు ఉంటుంది.

మారుతీ సుజుకీ పాపులర్ వ్యాగన్‌ఆర్‌పై రూ.15 వేలు, స్విఫ్ట్ పై రూ.5వేలు, ఎయూవీ బ్రెజా రూ.20 వేలు, విటారాపై రూ.25వేలు, ఆల్టో కే10పై రూ.19,500, ఎస్-ప్రెసో రూ.5వేల వరకు పెరగనున్నాయి. ఇక ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనోపై రూ.9వేలు, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌పై  రూ.5,500, డిజైర్‌పై రూ.10వేలు పెంపు ఉంటుంది.