calender_icon.png 15 January, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

47 శాతం పెరిగిన మారుతి లాలభాలు కలిసొచ్చిన అమ్మకాలు

01-08-2024 01:00:34 AM

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ  త్రైమాసిక ఫలితాల్లో దూసుకెళ్లింది. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.3,650 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,485 కోట్లతో పోలిస్తే లాభం 47 శాతం వృద్ధి చెం దింది. వ్యయ నియంత్రణ చర్యలు, విక్రయా ల్లో వృద్ధి నమోదుకావడంతో కంపెనీ లాభాలు పెరగడానికి దోహదపడింది.విక్రయాలు పెరిగినట్లు మారుతీ సుజుకీ బుధవారం తన ఫైలింగ్‌లో పేర్కొంది.

జూన్ ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు రూ.33,875 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి రూ.30,845 కోట్లుగా ఉండేవి. మొదటి త్రైమాసికంలో మొత్తం విక్రయాలు 5,21,868 యూనిట్లకు చేరాయని తెలిపింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 5శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక దేశీయ విక్రయాలు 4,51,308 యూనిట్లకు, ఎగుమతులు 70,560 యూనిట్లకు చేరాయని పేర్కొంది.ముఖ్యంగా ఎస్‌యూవీ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ షేరు బీఎస్‌ఈలో 2.28శాతం పెరిగింది.