లక్షెట్టిపేట్ (విజయక్రాంతి): మున్సిపల్ కమిషనర్ గా మారుతీ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మారుతి ప్రసాద్ ను లక్షేట్టిపేట్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లక్షేట్టిపేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.