calender_icon.png 17 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతి, మహీంద్రా రికార్డు అమ్మకాలు

02-11-2024 12:00:00 AM

పండుగ నెలలో ఆటో సేల్స్ గణాంకాలు

ముంబై, నవంబర్ 1: దసరా, దీపావళి పండుగలు కలిసొచ్చిన 2024 అక్టోబర్ నెలలో మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రాలు రికార్డు స్థాయిలో అమ్మకాల్ని నమోదు చేశాయి. అక్టోబర్‌లో ఎగుమతుల తో కలుపుకుని రికార్డుస్థాయిలో 2,06,434 యూనిట్లను విక్రయించినట్లు  మారుతి తెలిపింది.

నిరుడు ఇదేనెలతో పోలిస్తే అమ్మకాల్ని 4 శాతం పెంచుకున్నది. అయితే దేశీయంగా కంపెనీ హోల్‌సేల్ అమ్మకాలు మాత్రం 5 శాతం క్షీణించి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. డీలర్ల వద్ద పేరుకుపోయిన నిల్వల్ని తగ్దించేందుకు డీలర్లకు చేసే హోల్‌సేల్ డిస్పాచ్‌లను మారుతి కుదించింది.

ఈ అక్టోబర్‌లో అత్యధిక అమ్మకాలు జరిపామని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. మారుతి మిని కార్లు ఆల్టో, ఎస్‌ప్రెసో, కాంపాక్ట్ కార్లు బలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ అమ్మకాలు తగ్గగా, యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ వితారా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 విక్రయాలు పెరిగాయి. 

మహీంద్రా అమ్మకాలు 20 శాతం వృద్ధి

మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం కార్ల అమ్మకాలు ఈ అక్టోబర్‌లో 20 శాతం పెరిగి 96,648 యూనిట్లకు చేరాయి. నిరు డు ఇదే నెలలో 80,678 యూనిట్లకు విక్రయించింది. దేశీయ మార్కెట్లో  యుటిలిటీ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 25 శా తం వృద్ధితో 43,708 యూనిట్ల నుంచి 54,504 యూనిట్లకు పెరిగాయని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా చెప్పారు.

ఇటీవల స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టయిన హ్యుందాయ్ మోటార్ దేశీయ అమ్మకాలు ఈ అక్టోబర్ లో స్వల్పంగా పెరిగి 55,128 యూనిట్ల నుం చి 55,568 యూనిట్లకు చేరాయి. తమ ఎస్‌యూవీ కార్లకు పండుగ సీజన్లో డిమాండ్ ప టిష్టంగా ఉన్నదని, దీనితో రికార్డుస్థాయిలో 37,902 ఎస్‌యూవిలను విక్రయించినట్లు హ్యందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. 17,497 క్రెటా కార్లను డెలివరీ చేశామన్నారు. 

తగ్గిన టాటా మోటార్స్ విక్రయాలు

టాటా మోటార్స్ పాసింజర్ వాహన విక్రయాలు దేశీయంగా 48,337 యూనిట్ల నుంచి స్వల్పంగా 48,131 యూనిట్లకు తగ్గాయి. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 యూనిట్ల నుంచి 28,136 యూనిట్లకు పెరిగాయి. జేడబ్ల్యూజీ ఎంజీ మోటార్స్ హోల్‌సేల్ అమ్మకాలు 31 శాతం పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి.