26-02-2025 01:55:59 AM
ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిది
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 ( విజయక్రాం తి): అమరుల కుటుంబాలకు మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం హైదరాబా దులో నిర్వహించిన మాదిగల అమరవీరుల సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. ఎన్ని తరాలైనా రుణం తీర్చుకోలేనిది అని అన్నా రు. మాదిగ శాసనసభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన అపారమైన రాజకీయ అనుభవం మేధస్సును రంగరిం చి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆయన చూపించిన చొరవ పట్టుదల చిత్తశుద్ధి కృషి మరువలేనిది అని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెం బ్లీలో ప్రకటన చేశారని గుర్తు చేశారు. మాదిగల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధత చిత్తశుద్ధి గురించి కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ఉప కులాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద య్య మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిపిసిసి జనరల్ సెక్రెటరీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.