05-04-2025 12:45:26 AM
మాజీ ఎమ్మెల్యే, బెజేపీ నేత మార్తి నేని ధర్మారావు విమర్శ
ఖమ్మం, ఏప్రిల్ 4 (విజయక్రాంతి):-కరోనా కాలం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా సుమారు 90 లక్షల కుటుంబాలకు రేషన్ అందిస్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో సరఫరా చేసే రేషన్ బియ్యానికి ఒక కిలో కలిపి అదేదో రాష్ట్ర ప్రభుత్వమే పం పిణీ చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమా వేశంలో ధర్మారావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో 49 లక్షల పైచిలుకు ఆన్లైన్ సభ్యత్వాలు, 41వేల పై చిలుకు సభ్యత్వం ఉందన్నారు.హెచ్యూసీ గురించి ప్రస్తావిస్తూ అడవిని అమ్ముకొని కోట్లు దన్నుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు.విలేకర్ల సమావేశంలో పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటేల విద్యాసాగర్, నున్నా రవి, కూసంపూడి రవీందర్, ఈవి.రమేష్, వేల్పల సుధాకర్, విజయ్రాజ్, చింతమళ్ల వీరస్వా మి, తాటికొండ రవి, కొదుమూరి రాజయ్య, తక్కెళపల్లి నరేందర్ పాల్గొన్నారు.