calender_icon.png 28 February, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగారకుడిపై బీచ్!

27-02-2025 11:32:46 PM

డేటా పంపిన చైనా రోవర్ 

 విశ్లేషించి వివరాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: అంగారకుడిపై కొన్నేళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని తాజా పరిశోధనల్లో బయటపడింది. 300 కోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం కారణంగా ఏర్పడిన బీచ్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని రోజుల కిందట అంగారకుడిపైకి చైనా జురాంగ్ రోవర్‌ను పంపించిన విషయం తెలిసిందే. ఆ రోవర్ మే 2021 2022 మధ్య అరుణగ్రహంపై గల ఉతోపియా ప్లానీషియా ప్రాంతంలో తిరుగుతూ అత్యంత ఫ్రీక్వెన్సీగల రేడియో తరంగాలను ఉపరితలం నుంచి 80 మీటర్ల లోతుకు పంపించి డేటాను సేకరించింది. రోవర్ అందించిన డేటాపై చైనా, అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే రోవర్ తిరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మహాసముద్రం ఉండేదని, దాని కారణంగా ఏర్పడ్డ తీర ప్రాంతానికి సంబంధించిన అవక్షేపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 3.5 బిలియన్ సంవత్సరాల్లో అంగారకుడి ఉపరితలంపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, అయితే రేడియో తరంగాల వల్ల ఉపరితలం లోతుల్లో కోస్టల్ ప్రాంతాన్ని గుర్తించామని గ్వాంగ్‌జౌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త హై లియూ పేర్కొన్నారు.