calender_icon.png 4 March, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

04-03-2025 02:01:22 AM

మలక్‌పేట, మార్చి 3: మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఓ వివాహత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన శిరీష(32) నాగర్‌కర్నూల్ దోమలపెంటకు చెందిన వినయ్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నది. వారు మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఓ ప్లాట్‌లో నివాసముంటున్నారు.

ఈ దంపతులకు కూతురు (2) ఉన్నది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సమయంలో నిజాంపేటలో నివాసముండే శిరీష మేనమామ లడే మధూకర్‌కు శిరీష తీవ్ర ఛాతినొప్పితో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నదంటూ తన శిరీష చెల్లెలు సమాచారం వచ్చింది. దీంతో మధూకర్ శీరీష ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

వెంటనే సదరు ప్రైవేటు దవాఖానకు ఫోన్ చేయగా.. శిరీషను దవాఖానకు భర్త వినయ్ తీసుకొచ్చాడని, కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్లారని దవాఖాన సిబ్బంది వివరించారు. కాగా మృతదేహాన్ని దవాఖానలోనే ఉంచాలని, తాను వచ్చే వరకు తీసుకెళ్లొద్దని చెప్పినప్పటికీ మృతదేహాన్ని తరలించారని మధూకర్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి వెంటనే తిరిగి వెనక్కి రావాలని చెప్పడంతో మృతదేహాన్ని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మృతదే హాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని మధూకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.