calender_icon.png 4 March, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

03-03-2025 11:37:16 PM

మలక్‌పేట: మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఓ వివాహత అనుమానాస్పస్థితిలో మృతి చెందింది. మృతురాలు గుండెపోటుతో మృతి చెందిందని ఆమె గుండెపోటుతో మృతి చెందిందని ఆమె తల్లికి సమాచారం ఇచ్చిన భర్త, అత్తమామలు, వారు అక్కడికి చేరుకోకముందే మృతదేహాన్ని సొంతూరుకు తరలించడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. దీంతో మృతురాలి మేనమామ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు, బాధితుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. 

కరీంనగర్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీకి ముగ్గురు కుమార్తెలు. మూడవ కుమార్తె(32) ను నాగర్‌కర్నూల్ దోమలపెంట ప్రాంతానికి చెందిన వినయ్‌తో గత 2017లో వివాహం జరిగింది. మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఫ్లాట్ నం. 106లో నివాసముంటున్న ఈ దంపతులకు ఓ కూతురు ప్రిన్సీ(2) ఉన్నది. కాగా, ఆదివారం మధ్యాహ్నం సమయంలో సమయంలో విజయలక్ష్మీ సోదరుడు, నిజాంపేటలో నివాసముండే లడే మధూకర్ కు మలక్‌పేటలో నివాసముంటున్న మేనకోడలు(32) తీవ్ర ఛాతినొప్పితో మెట్రో క్యూర్ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లుగా రెండవ కోడలు నుంచి సమాచారం వచ్చింది. ఈ మేరకు లడే మధూకర్ మూడవ మేనకోడలు మృతురాలి ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. ఆ సమయంలో ఎవరో మాట్లాడారని, ఆ తరువాత ఫోన్‌కాల్స్‌కు ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై అనుమానాలు వచ్చాయి. వెంటనే మెట్రో క్యూర్ దవాఖానకు ఫోన్ చేయడంతో ఆమె మేనకోడలను దవాఖానకు భర్త వినయ్ తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పడంతో తిరిగి తీసుకెళ్లారని దవాఖాన సిబ్బంది వివరించారు.

శవాన్ని దవాఖానలో పెట్టాలని తాను వచ్చే వరకు తీసుకెళ్లద్దని చెప్పినప్పటికి మృతదేహాన్ని తరలించారని లడే మధూకర్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అంబులెన్స్ డ్రైవర్ కు ఫోన్ చేసి వెంటనే తిరిగి వెనక్కిరావాలని చెప్పడంతో మృతదేహాన్ని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. ఇదిలా, ఉండగా మృతురాలి శరీరం పై గాయాలు ఉన్నాయని, తమకు అనుమానంగా ఉందని లడే మధూకర్ ఆరోపించారు.