హుజూర్‌నగర్, జనవరి 13: సూర్యాపేట పట్టణానికి చెందిన రాజుకు 2011లో నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన నందిపాటి శోభతో వివా అయింది. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో 2015 నుంచి శోభ భర్తకు దూరంగా నేరేడుచర్ల లో కూలీ పను చేసుకుంటూ ఉంటున్నది.
ఈ క్రమంలో శోభకు పరిచయమైన పొనుగోడు గ్రామానికి చెందిన మోదుగు మధుతో కలిసి గరిడేపల్లి మండలం ఎల్‌బినగర్‌లో గత రెండు నెలలుగా ఉంటున్నది. ఇంతలోనే ఈ నెల 12న శోభ మృతిచెందడంతో.. అమె తండ్రి పిడమర్తి వెంకటయ్య అనుమానం వ్యక్తం చేస్తూ గరిడేపల్లి ఎస్సై నరేశ్‌కు ఫిర్యాదు చేశారు.