calender_icon.png 12 February, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

12-02-2025 12:00:00 AM

జనగామ, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):  ములుగు జిల్లా కన్నా  మండలం  తుపాకులగూడెంలో ఆలం స్వామి, ఆలం అశ్విని కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. అశ్వినికి ఇంతకుముందే వేరే వ్యక్తితో వివాహంకాగా, కుమారుడు కూడా ఉన్నా డు. భర్తను వదిలేసి అశ్విని తన ప్రియుడు స్వామి వద్దకు వెళ్లింది. అశ్విని భర్త పెద్ద మనుషులను సంప్రదించాడు.

వారు పంచాయితీలో అశ్విని భర్తకు కొంత డబ్బు చెల్లిం చాలని నిర్ణయించారు. ఆ డబ్బును తీసుకునేందుకు అశ్విని భర్త ఒప్పుకోలేదు. ఆయన పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి  తెలిసింది. దీంతో ఆందోళన చెందిన అశ్విని, స్వామి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.