calender_icon.png 4 March, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్నం వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య

04-03-2025 02:41:58 PM

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) పూణెలో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఆమెతో కలిసి అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువైపుల పెద్దలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి అయిన తర్వాత ప్రశాంతి హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. అయితే కొంతకాలం నుండి  భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవిక, సతీశ్ ఇద్దరు ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక బెడ్ రూంలోకి వెళ్లి  డోర్ లాక్ చేసుకుంది. మంగళవారం ఉదయం సతీష్ బెడ్ రూమ్ తలుపులు తెరిచేందుకు ఎంత ప్రయత్నించిన తీయకపోవడంతో బద్దలుకొట్టి  లోపలికి వెళ్ళి చూడగా, దేవిక ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దేవిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని దేవికా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5 లక్షల కట్నం 15 తులాల బంగారం ఇచ్చిన కూడా అదనపు కట్నం కోసం వేధించినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.